మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని కిల్లారి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలోని ఓ చక్కెర కార్మాగారం అనేక ఏళ్లుగా మూతబడి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ఔసా నియోజకవర్గ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ స్థానిక నీలకంఠేశ్వర ఆలయాన్ని సందర్శించారు. చక్కెర పరిశ్రమ మళ్లీ అందుబాటులోకి వస్తే.. సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఆలయానికి వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల కార్మాగారం పునఃప్రారంభం కావడంతో ఆయన 3 కి.మీ. మేర సాష్టాంగ ప్రణామాలు చేశారు.