
ఒకేసారి ఢీకొన్న ఏడు కార్లు
హైదరాబాద్ లో రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం వరుసగా ఏడూ కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే అన్ని కార్లలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దసరా సెలవులు ముగియడంతో వాహనాల రద్దీ పెరగడంతో ఈ ప్రమాదం జరిగి, సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




