బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని భారీ మెజార్టీతో గెలిపించిన నితిన్ నబిన్, 45 ఏళ్ల వయసులోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల అనంతరం జాతీయ అధ్యక్షుడిగా ఆయన తొలిసారి తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నిర్వహించనున్న 'బూత్ కార్యకర్తల సమ్మేళనం'లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ ఆయన పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించింది.