TG: హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఇటీవల ప్రియాంకాగాంధీపై బీజేపీ నేత బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ యూత్ నాయకులు బీజేపీ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.