TG:
జనసేన సభకు
కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని తెలంగాణ
బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఎన్డీయే భాగస్వామి అయిన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల తమకు గౌరవం ఉందని తెలిపారు. నిర్మల్, బోధన్ లలో మత విద్వేషాలు రెచ్చగొట్టే అక్బరుద్దీన్ ఓవైసీకి అనుమతించిన
కాంగ్రెస్,
జనసేన సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. ఈ నిర్ణయాన్ని ఎన్డీయే పక్షంగా తీవ్రంగా తప్పుబడుతున్నామని స్పష్టం చేశారు.