
హైదరాబాద్ వచ్చే విమానానికి బాంబు బెదిరింపు
దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈకే526 విమానానికి పేల్చేస్తామంటూ ఇ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమై, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి, ప్రయాణికులను తరలించారు. విమానాన్ని తనిఖీ చేయగా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. గురువారం కూడా మదీనా, షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. మదీనా విమానాన్ని అహ్మదాబాద్లో, షార్జా విమానాన్ని శంషాబాద్లో ల్యాండ్ చేసి తనిఖీలు చేపట్టారు.




