రాజస్థాన్ పుష్కర్‌లోని ఓ హోటల్ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. కమోడ్‌లో ఐదడుగుల నల్ల త్రాచుపాము బుసలు కొడుతూ కనిపించడంతో షాక్ అయ్యాడు. కేకలు వేస్తూ బయటకు వచ్చాడు. వెంటనే హోటల్ సిబ్బందికి విషయం చెప్పడంతో వారు కోబ్రా టీమ్‌కు సమాచారం ఇచ్చారు. వారొచ్చి అతికష్టంపై పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని అడవిలో వదిలిపెట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.