
తనకంటే అందంగా ఉన్నదని.. బాలికను చంపిన మహిళ
తనకంటే అందంగా ఉన్నదన్న అసూయతో ఓ మహిళ ఒక బాలికను హత్య చేసింది. హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోనిపట్‌కు చెందిన 6 ఏళ్ల విధి తన తల్లిదండ్రులతో కలిసి ఓ పెళ్లి వేడుక హాజరయ్యింది. అక్కడ ఆ బాలిక మేనత్త పూనమ్ చిన్నారిని నీటి టబ్‌లో ముంచి చంపింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పూనమ్‌ను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకుంది. గతంలో తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లలను కూడా ఆమె ఇలాగే హత్య చేసినట్లు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.




