
800 ఏళ్ల నాటి బాల గణేశుడి అరుదైన శిల్పం
TG: ఆదిలాబాద్ జిల్లా చందా గ్రామ శివారులో 800 ఏళ్ల నాటి అత్యంత అరుదైన బాల గణేశుడి శిల్పం వెలుగుచూసింది. పార్వతీదేవి ఒడిలో కూర్చుని చనుబాలు తాగుతున్న గణనాథుడి సహజ బాల్య రూపం, చేతిలో ఫలం, తలపై కిరీటం లేని ఈ శిల్పం పురావస్తు, చరిత్ర పరిశోధకులను విస్మయానికి గురిచేస్తోంది. ఇది సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందినదని, జైనథ్లోని లక్ష్మీనారాయణ ఆలయ శిల్ప శైలితో పోలికలున్నాయని చరిత్రకారులు నిర్ధారించారు.




