ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య కేసులో నిందితురాలైన ముస్కాన్ ప్రసవ నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ముస్కాన్ తన ప్రేమికుడితో కలిసి ఎనిమిది నెలలుగా జైలులో ఉంది. ఆమె భర్త సౌరభ్ రాజ్‌పుత్ పుట్టినరోజు నవంబర్ 24నే ఆమె తన రెండవ కుమార్తెకు జన్మనివ్వడం గమనార్హం. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ముస్కాన్ నెలన్నర గర్భవతిగా ఉన్నారు.