ఆకాశంలో ఈ నెల 31న అరుదైన ‘బ్లూ మైక్రో మూన్’ ఏర్పడనుంది. అర్ధరాత్రి వేళ చంద్రుడు భూమికి దూరంగా, చిన్నగా కనిపించనున్నాడు. ఓ నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’ అని, భూమికి అత్యంత దూరంగా చంద్రుడు వెళ్తే ‘మైక్రో మూన్’ అని పిలుస్తారు. ఈ రెండు సంఘటనలు ఒకే రోజున సంభవించనున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సమయంలో చంద్రుడు భూమికి 2,52,360 మైళ్ల దూరంలో ఉంటాడు. అప్పుడు చంద్రుడు 6% చిన్నగా, 10% తక్కువ కాంతితో కనిపిస్తాడు.