ముఖ సౌందర్యానికి బ్లూ బెర్రీస్

10691చూసినవారు
ముఖ సౌందర్యానికి బ్లూ బెర్రీస్
నేటి యువతలో ముడతల సమస్య పెరుగుతోంది. బ్లూ బెర్రీలో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినోల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుండి రక్షించి, కొత్త చర్మ కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడతాయి. బ్లూ బెర్రీలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు పర్యావరణ కాలుష్యం వల్ల చర్మానికి కలిగే హానిని తగ్గిస్తాయి.