ఇంటర్‌ ప్రవేశాల షెడ్యూల్‌పై బోర్డు కీలక నిర్ణయం

47చూసినవారు
ఇంటర్‌ ప్రవేశాల షెడ్యూల్‌పై బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఇంటర్‌ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. నిన్న జారీ చేసిన సర్క్యులర్‌పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఇంటర్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ తాజా పరిణామంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన నెలకొంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.