బోధన్ ఎమ్మెల్యే సుధర్షన్ రెడ్డికి కీలక బాధ్యతలు

38చూసినవారు
బోధన్ ఎమ్మెల్యే  సుధర్షన్ రెడ్డికి కీలక బాధ్యతలు
TG: బోధన్ ఎమ్మెల్యే సుధర్షన్ రెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలోని ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలును పర్యవేక్షించేందుకు ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. కేబినెట్ మంత్రి హోదాతో నియమితులైన సుధర్షన్ రెడ్డి.. ఇకపై జిల్లా కలెక్టర్లు, శాఖ కార్యదర్శులతో సమన్వయం చేస్తూ పథకాల పురోగతిని సమీక్షిస్తారు. ఈ మేరకు, ఆయనకు సచివాలయంలో మంత్రి స్థాయి వసతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్