స్కూల్‌కి వెళ్లిన ఇద్దరు
విద్యార్థులు చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగింది. మంగళవారం స్కూల్‌కు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని, విద్యార్థి ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలు స్కూల్ యూనిఫాంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. స్కూల్ సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరూ కలిసి బయటకు వెళ్లినట్లు రికార్డయ్యింది. విద్యార్థిని మృతదేహం వద్ద రక్తం కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరిపై అత్యాచారం చేసి హత్య చేశారని, నిందితులను ఉరితీయాలని ఆమె సోదరుడు ఆరోపించాడు.