వాగులో 12 ఏళ్ల బాలిక మృతదేహం.. తల మాయం

8చూసినవారు
వాగులో 12 ఏళ్ల బాలిక మృతదేహం.. తల మాయం
వాగులో 12 ఏళ్ల బాలిక తలలేకుండా మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా లల్మటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని దహువా గ్రామంలో కలకలం రేపింది. మృతదేహానికి తల లేకపోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గుర్తుతెలియని వ్యక్తులు బయటకు తీసుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్