బొలెరో వాహనం బోల్తా.. 40 మంది కూలీలకు గాయాలు

11891చూసినవారు
బొలెరో వాహనం బోల్తా.. 40 మంది కూలీలకు గాయాలు
TG: బోలెరో వాహనం బోల్తా పడి 40 మంది కూలీలకు గాయాలైన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం బూత్కూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పొరుగున ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని ఎంకంపల్లి గ్రామంలో పత్తి ఏరడానికి బోలెరోలో బయలుదేరారు. ఈ క్రమంలో మోజెర్ల స్టేజీ సమీపంలో బొలెరో టైర్ పేలి బోల్తా పడింది. దీంతో కూలీలకు గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్