బొల్లారం ఆయుధాల చోరీ.. హనీట్రాప్ కోణంలో విచారణ

2చూసినవారు
బొల్లారం ఆయుధాల చోరీ.. హనీట్రాప్ కోణంలో విచారణ
హైదరాబాద్‌లోని బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారాన్ని రక్షణ మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించింది. మద్రాస్ రెజిమెంట్‌లోని సిబ్బందిని హనీట్రాప్‌లో దించి దుండగులు చోరీకి పాల్పడి ఉంటారా అనే కోణంలోనూ ఆర్మీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సిబ్బంది సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్లు, కంప్యూటర్లను పరిశీలిస్తున్నారు. ఒకవేళ హనీట్రాప్ ఉదంతం ఉంటే ఈ కుట్ర మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంది. దీని వెనుక దేశద్రోహ శక్తులు ఉండే అవకాశంతో పాటు, ఆయుధాలు వారి చేతికి చిక్కితే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్