గుండెపోటుతో బాలీవుడ్ నటుడు భరత్ కపూర్ కన్నుమూత

42చూసినవారు
గుండెపోటుతో బాలీవుడ్ నటుడు భరత్ కపూర్ కన్నుమూత
బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు భరత్ కపూర్ (80) గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. 1970లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన ‘దేశ్ పరదేశ్’, ‘రామ్ బలరాం’, ‘నూరి’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో పాటు పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు. 80కి పైగా సినిమాల్లో నటించిన భరత్ కపూర్ మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్