బాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ కృష్ణ(81) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షారుఖ్‌ఖాన్ 'దేవదాస్' సినిమాలో హీరోకి ఫాదర్‌గా ఆయన నటించారు. గుజారిష్, గాంధీ, పీకే వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయన మృతిపై బాలీవుడ్ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.