పాకిస్థాన్ బజౌర్ జిల్లాలోని ఖార్ తహసీల్‌లోని కౌసర్
క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఊహించని పరిణామంతో
క్రికెట్ ప్లేయర్లు, ప్రేక్షకులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.