కువైట్ నుంచి ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. విమానంలోని వాష్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై 'విమానంలో బాంబు ఉంది' అని రాసి ఉండటాన్ని ఫ్లైట్ క్రూ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ కిందకు దించి, భద్రతా దళాలు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి.