అమీర్‌పేట్ HMDA కార్యాలయానికి బాంబు బెదిరింపు

43చూసినవారు
అమీర్‌పేట్ HMDA కార్యాలయానికి బాంబు బెదిరింపు
హైదరాబాద్ అమీర్‌పేట్ HMDA ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వస్తువుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాంబు బెదిరింపునకు పాల్పడింది ఎవరో పోలీసులు ఆరా తీస్తున్నారు.