తమిళనాడు పుదియతరం కార్యాలయానికి బాంబ్ బెదిరింపు సందేశం వచ్చింది. పుదియతరం కార్యాలయాన్ని పేల్చేస్తామని తమిళనాడు డీజీపీ కార్యాలయానికి మెయిల్ ద్వారా అజ్ఞాత వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే బాంబ్ స్క్వాడ్, శునకాలు సహాయంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టగా.. ఇది ఫేక్ మెయిల్‌గా తేలింది. ఈ బెదిరింపుకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.