దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతోపాటు అట్టుకల్ అమ్మవారి ఆలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులను బయటకు పంపించి ఆలయంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.