ఢిల్లీలోని ప్రఖ్యాత తాజ్ ప్యాలస్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తితెలియని వ్యక్తులు మెయిల్ పంపించారు. బాంబు పెట్టి హోటల్‌ను పేల్చేస్తామని దుండగులు మెయిల్‌లో హెచ్చరించారు. దీంతో బాంబు స్క్వాడ్ బృందం, పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటల్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. దీంతో హోటల్‌లోని అతిథులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.