హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

1చూసినవారు
హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు
హీరోయిన్ త్రిష ఇంటికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని ఆళ్వార్ పేట్లో ఉన్న త్రిష ఇంటిలో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఇది బూటకపు బెదిరింపుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇలా బెదిరింపులు రావడం ఇది నాలుగోసారని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్