అక్టోబర్‌ నుంచే ఎముకలు కొరికే చలి

13930చూసినవారు
అక్టోబర్‌ నుంచే ఎముకలు కొరికే చలి
ఈ సంవత్సరం చివర్లో 'లా నినా' తిరిగి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య 71% అవకాశంతో లా నినా అభివృద్ధి చెందుతుందని, తర్వాత 2026 ఫిబ్రవరి వరకు ప్రభావం 54%కి పడిపోతుందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. లా నినా పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలను మార్చి, ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత్‌లో సాధారణం కంటే చల్లగా శీతాకాలం రావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.