
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. రంజీలో సంచలనం (వీడియో)
మేఘాలయ బ్యాటర్ ఆకాశ్ చౌదరీ రంజీ ట్రోఫీలో 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. ఆదివారం సూరత్‌లో అరుణాల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆకాశ్, వరుసగా ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇదే. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 628 పరుగులు చేసింది.




