
కామాంధుడిని ఎన్కౌంటర్ చేసిన యూపీ పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు మెహనూర్ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించాడు. మంగళవారం మొక్కజొన్న పొలంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై మెహనూర్ కాల్పులు జరపగా, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. నిందితుడి వద్ద రెండు తుపాకులు లభ్యమయ్యాయి. అతనిపై పలు జిల్లాల్లో 12 కేసులు నమోదైనట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.




