వైఎస్‌పై పవన్‌ వ్యాఖ్యలను ఖండించిన బొత్స సత్యనారాయణ

35చూసినవారు
వైఎస్‌పై పవన్‌ వ్యాఖ్యలను ఖండించిన బొత్స సత్యనారాయణ
AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు మంత్రి బొత్స సత్యనారాయణ గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎదురించానని పవన్ కల్యాణ్ చెప్పడం సరికాదని, తెలంగాణకు వెళ్లినప్పుడు తనను ఎవరూ ఆపలేదని, దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చని బొత్స అన్నారు. ఆంధ్రప్రదేశ్ నేతల విగ్రహాలను తొలగిస్తామనడం సరికాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఎక్కడా అనుమతి ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, వాటిని ఖండిస్తున్నామని బొత్స తెలిపారు.

సంబంధిత పోస్ట్