ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడి బాలుడు మృతి

54చూసినవారు
ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడి బాలుడు మృతి
TG: హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్, అనూష దంపతుల కుమారుడు శశివర్ధన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని కెనాల్లో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు బయటికి తీసి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ట్యాగ్స్ :