TG: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ అల్కాపురి కాలనీలో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనంపై వెళ్తోన్న తండ్రీ కొడుకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ కుమార్, అతని కుమారుడు కుశల జోయల్ తీవ్రంగా గాయపడ్డారు. బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే జోయల్ మృతి చెందాడు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.