
పెన్షన్ ఆశ చూపించి వృద్ధురాలి మెడలోంచి 3 తులాల గొలుసు చోరీ
తెలంగాణలో చైన్ స్నాచింగ్ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 10న పెద్దపల్లి జిల్లా ధర్మారంలో, 67 ఏళ్ల బుదారపు శంకరమ్మను రూ. 4000 పెన్షన్ మంజూరు అయిందని, ఫోటో అప్లోడ్ చేయాలని నమ్మించి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును ఒక దుండగుడు ఎత్తుకెళ్లాడు. పెన్షన్ రావాలంటే పుస్తెల తాడు ఫోటోలో కనిపించకూడదని చెప్పి, వృద్ధురాలిని నమ్మించి గొలుసును తీసుకుని పారిపోయాడు. మోసపోయిన వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




