ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి పిండి మిల్లుకి గోధుమలు తీసుకెళ్లిన మోహిత్ (15) అనే బాలుడు మృతి చెందాడు. పిండి మెషీన్ ఆన్ చేసి గోధుమలు వేయగా ఒక్కసారిగా పేలి ఎగిరిపడిన బండరాయి రాయి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారికీ ప్రమాదం తప్పింది. పరిహారం ఇవ్వాలని బాలుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.