సరదాగా ఈతకు వెళ్లి బాలుడి దుర్మరణం

22చూసినవారు
సరదాగా ఈతకు వెళ్లి బాలుడి దుర్మరణం
TG: ఈత సరదా ఓ బాలుడి ప్రాణాన్ని బలి తెసుకుంది. ఈ ఘటన ఖమ్మం(D) కొణిజర్ల(M) పరిధిలోని చిన్న గోపతి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వైరా(M) గొల్లపూడి గ్రామానికి చెందిన బాల్ది వెంకటేశ్వర్లు–నాగేంద్ర దంపతుల కుమారుడు అరవింద్(12) తన నానమ్మతో కలిసి చిన్న గోపతి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే గ్రామానికి చెందిన కొందరు పిల్లలు ఈత కొట్టేందుకు సమీపంలోని బావిలో దూకారు. వారిని చూసి బాలుడు కూడా బావిలోకి దూకాడు. అయితే ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్