తమిళనాడులోని మదురై జిల్లాలో విషాద ఘటన జరిగింది. కారు డోర్ లాక్ కావడంతో ఓ బాలుడి మృతి చెందాడు. నవంబర్ 13న ఏడేళ్ల షణ్ముగవేలన్ తన కుటుంబంతో కలిసి నానమ్మ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో షణ్ముగవేలన్ కొందరు పిల్లలతో ఆడుకుంటూ పార్క్ చేసిన కారులో దాక్కున్నాడు. ప్రమాదవశాత్తు డోర్ లాక్ కావడంతో అందులో చిక్కుకున్నాడు. బాలుడు కనిపించడంలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బాలుడి కోసం వెతికగా 2 రోజుల తర్వాత కారులో మృతదేహాన్ని గుర్తించారు.