AP: పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులో గత నెల 24న జరిగిన పెద్దబాజీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు బాలసుబ్రమణ్య చారి, రాంబాయమ్మలను ఈ నెల 6న అరెస్టు చేసినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. హత్యకు గురైన పెద్దబాజీ భార్యతో బాలసుబ్రమణ్య చారికి వివాహేతర సంబంధం ఉందని, దీనిపై వివాదం నడుస్తుండటంతోనే బాజీని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడని, దీనికి నిందితుడి అత్త సహకరించినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య షేక్. జబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.