యూపీలోని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక వ్యక్తి తన ప్రియురాలితో మాట్లాడుతున్న మరో వ్యక్తిపై పిస్టల్‌తో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. తుపాకీతో దాడి చేసిన వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత విభేదాలే ఈ దాడికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.