
కాసేపట్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
AP: కాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఈ మేరకు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల కింద ప్రజలు నిలబడకూడదని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.




