TG: ప్రియురాలు వేరే యువకుడిని పెళ్లి చేసుకుందని ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌కు చెందిన శ్రీకాంత్.. అఖిల అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ క్రమంలో ఆమె కోసం శ్రీకాంత్ లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. అయితే సదరు యువతి శ్రీకాంత్‌ను కాకుండా వేరే యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ప్రాణాలు విడిచాడు. కాగా మోసం చేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.