AP: కడప సికె దిన్నెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ప్రియుడు శ్రీను తన ప్రియురాలు షేక్ శంషాద్ బేగంను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం, అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనుకు తీవ్రగాయాలవడంతో అతన్ని కడప రిమ్స్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.