ప్రియురాలిని హత్య చేసి.. ఇంటికెళ్లి నిద్రపోయిన ప్రియుడు

36789చూసినవారు
ప్రియురాలిని హత్య చేసి.. ఇంటికెళ్లి నిద్రపోయిన ప్రియుడు
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఝుంఝునుకు చెందిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ ముఖేష్ కుమారి (37) పదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. టీచర్‌ మనారామ్‌తో ఆమెకు ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ నెల 10న 600 కిలోమీటర్లు ఆమె కారు డ్రైవ్ చేసుకుని ప్రియుడి వద్దకు వెళ్లింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అతడు ఆమెను చంపేశాడు. కారు డ్రైవింగ్ సీటులో మృతదేహాన్ని ఉంచి ఇంటికెళ్లి నిద్రపోయాడు. పోలీసుల విచారణలో టీచర్ దొరికిపోయాడు.