పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

10199చూసినవారు
పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
TG: ప్రేమిస్తున్నానని నమ్మించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వాంబే కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని(17) సోఫియా రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ యువకునితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అయితే పెళ్లి విషయంలో ఆ యువకుడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన సోఫియా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్