యూపీలోని కాన్పూర్‌లో ఓ యువకుడు ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఆకాంక్ష, సూరజ్ కుమార్ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి ఆకాంక్ష ఉంటోంది. అయితే సూరజ్ కు మరో మహిళతో పరిచయం ఉన్నట్లు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ మేరకు జులై 21న ప్రియుడు ఆమె గొంతు కోసి చంపి.. స్నేహితుడితో కలిసి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి 100 కి.మీ దూరంలో ఉన్న యమునా నదిలో పారేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం బయటపడింది.