HYDలో శుక్రవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఏపీలోని బాపట్లకు చెందిన 26 ఏళ్ల యువతి మోసపోయింది. యువతి స్టడీ రోజుల్లోనే విద్యాసాగర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వారి ప్రేమ ఇప్పటివరకు కొనసాగింది. ఈ క్రమంలో విద్యాసాగర్ ఆమెను పెళ్లి చేసుకోనని చెప్పి.. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన నగ్న చిత్రాలను SMలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. దీనిపై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.