TG: జగిత్యాల జిల్లాకు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, సూక్ష్మ కళాకారుడు దయాకర్ మరో అద్భుతాన్ని సృష్టించారు. గణపతి విగ్రహం చేతిలో బ్రహ్మోస్ మిస్సైల్ పట్టుకున్న రూపాన్ని గుండు పిన్నుపై చెక్కి చూపించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్ మిస్సైల్‌ను గణపతితో అనుసంధానం చేస్తూ దేశ గౌరవాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.