కేరళలో 67కు చేరిన మెదడు తినే అమీబా కేసులు.. 18 మంది మృతి

13801చూసినవారు
కేరళలో 67కు చేరిన మెదడు తినే అమీబా కేసులు.. 18 మంది మృతి
కేరళలో మెదడు తినే అమీబా కేసుల సంఖ్య 67కు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది మరణించారు. తాజాగా తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల బాలుడికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకింది. అతడు తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసిన తర్వాత వ్యాధి బారిన పడ్డాడు. దీంతో అధికారులు ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసివేశారు. కేరళలో మెదడు తినే అమీబా కారణంగా ఒకే నెలలో ఐదుగురు మరణించారు. వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్