రేపటి నుంచి పెళ్లిళ్లకు బ్రేక్

0చూసినవారు
రేపటి నుంచి పెళ్లిళ్లకు బ్రేక్
పెళ్లిళ్ల సందడికి తాత్కాలిక విరామం ఏర్పడింది. అధిక జ్యేష్ఠ మాసం (మూఢమి) ప్రారంభం కానుండటంతో మే 15 నుంచి జూన్ 18 వరకు 36 రోజుల పాటు వివాహాలు, గృహప్రవేశాలు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించరాదని పండితులు సూచిస్తున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. శుభకార్యాలు నిలిచిపోవడంతో ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, డెకరేషన్, బంగారం, బట్టల వ్యాపారాలు, ఫొటోగ్రఫీ, ట్రావెల్స్ వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్