15వ ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్

40చూసినవారు
15వ ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్
TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు రూ.5,000 కోట్లకు పైగా నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,090 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన రూ.2,979 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,200 కోట్లు ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం కింద గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించిన రూ.9,968 కోట్లలో, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్రం మొదటి విడత నిధులను విడుదల చేయలేదు. కేంద్రం విధించిన నిబంధనల వల్ల నిధుల డ్రా చేసుకోవడం సవాలుగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్